చెర్రీకి గౌరవ డాక్టరేట్‌.. 

TV9 Telugu

13 April 2024

ఆర్ఆర్ఆర్ తో ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకొని గ్లోబల్‌ స్టార్‌గా ఎదిగిన రామ్‌చరణ్‌ని గౌరవ డాక్టరేట్‌ వరించింది.

కార్డిఫ్ దేశ రాజధాని వేల్స్ నగరంలోని ప్రముఖ వేల్స్ యూనివర్శిటీ ఆయన్ని గౌరవ డాక్టరేట్‌తో సత్కరించనుంది.

ఈ నెల 13న జరిగే స్నాతకోత్సవంలో టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్‌ పాల్గొని గౌరవ డాక్టరేట్‌ని స్వీకరించనున్నారు.

ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్‌ చేంజర్‌లో హీరోగా నటిస్తున్నారు రామ్‌చరణ్‌.

దీంతో పాటు బుచ్చిబాబుతో చేస్తున్న RC16 మూవీ చిత్రీకరణలో కూడా పాల్గొననున్నారు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్.

తాజాగా సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సైన్ చేసారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన రంగస్థలం బ్లక్ బస్టర్ అయింది.

చెర్రీ చేస్తున్న గేమ్ చేంజర్, RC16 సినిమాలు; సుకుమార్ పుష్ప 2 పూర్తైన తర్వాత ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.

ట్రిపుల్ ఆర్ తర్వాత చరణ్, పుష్ప తర్వాత సుకుమార్ కలిసి చేస్తున్న కావడంతో RC17పై భారీ అంచనాలు ఉన్నాయి.