దీపావళికి గేమ్‌ చేంజర్‌.? శంకర్ కెరియర్ కి 30 ఏళ్లు..

Anil Kumar

05 July 2024

శంకర్‌ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా 'గేమ్‌ చేంజర్‌' షూటింగ్ దశలో ఉంది.

ఇందులో రామ్‌ చరణ్‌ సరసన కియారా అద్వానీ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాలో అంజలి మరో హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమాకు సంబంధించి కేవలం మరో పది రోజుల షూటింగ్‌ పెండింగ్‌లో ఉందని డైరెక్టర్ శంకర్ తాజాగా తెలిపారు.

అయితే ఆ మిగిలిన షెడ్యూల్ కంప్లీట్ చేసుకొని.. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసిన తరువాత రిలీజ్ డేట్ చెప్తామని..

2024 దీపావళికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నట్టు ఇండస్ట్రీ సమాచారం.

ఇదిలా ఉంటె ఈ సినిమాను భారీ బడ్జెట్ తో పొలిటికల్ బ్యాగ్రౌండ్ వైవిధ్యమైన కథతో తెరకెక్కిస్తున్నారు శంకర్.

ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసిన శంకర్.. ఇప్పుడు రామ్ చరణ్ సినిమాను మరో ఇంట్రెస్టింగ్ కథతో రానున్నారు.

ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు పాత్రల్లో కనిపించనున్నారు. శంకర్ తన సినీ కెరీర్ లో 30 ఏళ్లు పూర్తి చేసుకున్నారు.