హైదరాబాద్‌లో గేమ్ చేంజర్‌.. ఓటీటీలో కీడా కోలా..

30 December 2023

TV9 Telugu

రామ్ చరణ్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ గేమ్ చేంజర్‌.

దిల్‌ రాజు బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్‌ హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

ఈ షెడ్యూల్‌లో హీరో రామ్‌ చరణ్, హీరోయిన్ కియారా అద్వానీతో పాటు మిగిలిన లీడ్‌ యాక్టర్స్ అంతా పాల్గొంటున్నారు.

2024 సెప్టెంబర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చూస్తున్న మూవీ మేకర్స్. దీనికి తగ్గట్టే షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

తరుణ్ భాస్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్ కామెడీ మూవీ కీడా కోలా. ఇందులో బ్రహ్మానందం ఓ ముఖ్య పాత్రలో కనిపించారు.

థియేట్రికల్‌గా మంచి విజయం సాధించిన ఈ సినిమా ఈ రోజు రాత్రి నుంచి డిజిటల్‌ ఆడియన్స్‌కు అందుబాటులోకి రానుంది.

రానా దగ్గుబాటి సమర్పణలో వీజీ సైన్మా పతాకంపై వివేక్‌ సుదాన్షు నిర్మించిన ఈ సినిమా నవంబర్‌ 3న థియేటర్లలో రిలీజ్ అయ్యింది.

తాజాగా ఓటీటీలో విడుదలైంది ఈ కామెడీ ఎంటర్టైనర్. ప్రముఖ ఓటీటీ ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది ఈ చిత్రం.