గేమ్ ఛేంజర్ న్యూ షెడ్యూల్..  లాల్ సలామ్ పై ఐశ్వర్య ఓపెన్..

TV9 Telugu

11 March 2024

స్టార్ హీరో రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా గేమ్ ఛేంజర్.

కొన్ని రోజులుగా ఈ చిత్ర షూటింగ్ జరగడం లేదు. తాజాగా ఈ చిత్ర కొత్త షెడ్యూల్‌పై క్లారిటీ ఇచ్చారు మేకర్స్.

మార్చి రెండో వారం నుంచి వైజాగ్‌లో 20 రోజుల పాటు భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు చిత్ర దర్శకుడు శంకర్.

ఇందులో కీలక సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారు దర్శకుడు. ఈ చిత్రం డిసెంబర్ 25న విడుదల కానుంది.

విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా ఐశ్వర్య రజినీకాంత్ తెరకెక్కించిన స్పోర్ట్స్ యాక్షన్ సినిమా లాల్ సలామ్.

రజినీకాంత్ ఇందులో కీలక పాత్రలో నటించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం దారుణమైన డిజాస్టర్‌గా నిలిచింది.

తాజాగా ఈ సినిమా ఫలితం గురించి ఓపెన్ అయ్యారు ఈ చిత్ర దర్శకురాలు రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్.

ముందు అనుకున్న కథను చాలా సార్లు మార్చడం వల్లే సినిమా చెడిపోయిందని తెలిపారు ఐశ్వర్య. వచ్చే సినిమాకు ఇది తనకు మంచి అనుభవం అన్నారు ఈమె.