క్లీంకారకు అదిరిపోయే గిఫ్ట్ పంపిన ఎన్టీఆర్
రామ్ చరణ్-ఉపాసన దంపతులకు పెళ్లైన 10ఏళ్ల తర్వాత వారు తల్లిదండ్రులు అయ్యారు.
దీనితో మెగా కుటుంబంతో పాటు ఫ్యాన్స్ కూడా సంతోషంలో ఉన్నారు.
ఇప్పటికే ఆ పాపకు క్లీంకార అని పేరు కూడా పెట్టారు.
మెగా ఫ్యామిలీతో పాటు ఉపాసన కుటుంబం నుంచి కూడా చెర్రీ దంపతుల గారాల పట్టీకి బహుమతులు భారీగానే అందాయి.
అందులో భాగంగగానే జూ. ఎన్టీఆర్ కూడా క్లీంకార కోసం ప్రత్యేకమైన కానుకను పంపించారట.
ఆ గిఫ్ట్ కూడా తారక్ పిల్లలు అభయ్, భార్గవ్ రామ్‌లు ఎంతో ఇష్టంగా అందించినట్లు తెలుస్తోంది.
చరణ్,ఉపాసన,క్లీంకార ముగ్గురి పేరుతో ఉన్న బాంగారు డాలర్స్‌ను అద్భుతమైన డిజైన్‌లో తయారు చేయించి గిఫ్ట్‌గా పంపించారని తెలుస్తోంది.
ఈ ప్రచారం నిజమే ఉంటుందని ఫ్యాన్స్ కూడా అంటున్నారు. ఎందుకంటే చరణ్-తారక్ స్నేహ బంధం అలాంటిది.