చరణ్‌ - అర్జున్‌ వైజాగ్‌ కహానీ!

TV9 Telugu

12 March 2024

అల్లు అర్జున్‌కి వైజాగ్‌ ఎయిర్‌పోర్టులో అందిన ఆహ్వానం గురించి ఇంకా మాట్లాడుకుంటున్నారు సినిమా జనాలు.

విశాఖ ఎయిర్ పోర్ట్ కి వచ్చిన బన్నీ ఫ్యాన్స్ ని చూస్తుంటే అభిమానం సంద్రంలా కనిపించిందంటూ చెప్పుకుంటున్నారు.

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న పుష్ప 2 ది రూల్ సినిమా వైజాగ్‌లో షూటింగ్‌ జరుపుకోనుంది.

ఈ సినిమాలో బన్నీకి జోడిగా రష్మిక నాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సరిగ్గా ఇదే రోజుల్లోనే మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ కూడా సినిమా షూటింగ్ కోసం విశాఖపట్నంలో స్టే చేయనున్నారు.

శంకర్‌ దర్శకత్వంలో చరణ్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా గేమ్‌ చేంజర్‌.

ఈ సినిమా షూటింగ్‌ కూడా వైజాగ్‌లోనే జరగనుంది. ఇద్దరు స్టార్ల సినిమాలు ఒకేసారి హైదరాబాద్‌లో జరగడం మామూలుగా చూస్తూనే ఉంటాం.

కానీ, ఒకే ఫ్యామిలీకి చెందిన ఇద్దరు హీరోల సినిమాలు వైజాగ్‌లో ఇలా జరుగుతుండటంతో సాగరతీరానున్న అభిమానులు పుల్‌ ఖుషీగా కనిపిస్తున్నారు.