TV9 Telugu
13 February 2024
ఏంటి రకుల్.? ఈ టైంలో ఇలాంటి రిస్క్ అవసరమా.?
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు వరుస సినిమాల్లో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది రకుల్ ప్రీత్ సింగ్.
అటు త్వరలోనే తన ప్రియుడు జాకీ భగ్నానీతో పెళ్లి పీటలెక్కేందుకు రెడీ అయ్యింది ఈ పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్.
దీంతో ఈ బ్యూటీ సినీ ప్రయాణానికి ఇక ఫుల్ స్టాప్ పెట్టేసిందని ప్రచారం నడిచింది. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది.
ఈ బ్యూటీ ఎన్నడూ చేయలేని క్యారెక్టర్లో త్వరలో ఓ భారీ సినిమాతో మన ముందుకు వస్తోందని బాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది.
కొన్నాళ్లుగా ఆఫర్స్ లేకుండా ఉన్న రకుల్ కు.. ఇప్పుడు భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులో ఆఫర్ వచ్చినట్లుగా తెలుస్తోంది.
బాలీవుడ్ డైరెక్టర్ నితేశ్ తివారి అత్యంత ప్రతిష్టాత్మకంగా రామాయణాన్ని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ మూవీలో కీలకమై శూర్పణఖ పాత్రను రకుల్ పోషించినట్లు సమాచారం. ఈ పాత్ర కోసం మేకర్స్ ఆమెను సంప్రదించగా..
వెంటనే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని త్వరలోనే లుక్ టెస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ అవుతుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి