TV9 Telugu
పెళ్లయిన మూడు రోజుల్లోనే రకుల్.! ఘనంగా ఆశీష్ రెడ్డి రిసెప్షన్..
26 Febraury 2024
తన పెళ్లయిన మూడు రోజుల్లోనే ఫోటోషూట్స్‌తో పూర్తిగా బిజీ అయిపోయారు స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.
భర్త జాకీ భగ్నానితో కలిసి ఒక మ్యాగజైన్ కవర్ పేజీపై ఫోజులు ఇచ్చారు. నూతన దంపతుల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ మధ్యే గోవాలో ఘనంగా రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నాని వివాహం జరిగింది. దీనికి చాలా తక్కువ మంది ప్రముఖులు హాజరయ్యారు.
మనోజ్ బాజ్‌పెయీ, రాజ్ డికే కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్. ఇప్పటికే వచ్చిన రెండు సీజన్స్ మంచి సక్సెస్ అయ్యాయి.
తాజాగా మూడో సీజన్ కూడా రెడీ అవుతుంది. అందులో సందీప్ కిషన్ కీలక పాత్రలో నటిస్తున్నారని తెలుస్తుంది. పార్ట్ 1లో కూడా ఈయన ముఖ్య పాత్రలో నటించారు.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుడు కుమారుడు ఆశీష్ రెడ్డి, అద్వైత రిసెప్షన్ హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్‌లో ఘనంగా జరిగింది.
అట్టహాసం జరిగిన ఈ వేడుకకు సినీ రాజకీయ ప్రముఖులతో పాటు మీడియా కూడా హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు.
ఈ మధ్యే ఫిబ్రవరి 14న జైపూర్‌లో ఘనంగా ఆశీష్ రెడ్డి, అద్వైత రెడ్డి వివాహం కుటుంబ సభ్యులు మధ్య ఘనంగా జరిగింది
ఇక్కడ క్లిక్ చెయ్యండి