TV9 Telugu
పెళ్ళైన సినిమాలతో రకుల్ బిజీ.. గీతాంజలి మళ్లీ వచ్చింది..
25 Febraury 2024
పెళ్లికి ముందు ఎలాగైతే సినిమాలు చేసానో.. ఇప్పుడు కూడా అలాగే కంటిన్యూ చేస్తానంటున్నారు రకుల్ ప్రీత్ సింగ్.
తాజాగా ప్రియుడు జాకీ భగ్నానీని పెళ్లాడిన రకుల్ ప్రీత్ సింగ్.. సినిమాలకు కూడా అలాగే సైన్ చేస్తున్నారు.
తమిళంలో ఇండియన్ 2 సహా మరో రెండు సినిమాలు చేస్తున్న రకుల్.. త్వరలోనే తెలుగులోనూ ఓ భారీ సినిమాను లైన్‌లో పెడుతున్నారు.
వరుణ్ తేజ్ హీరోగా నటించిన పుల్వామా ఉగ్రదాడి ఆధారంగా తెరకెక్కిన ఆపరేషన్ వాలెంటైన్ మార్చి 1న విడుదల కానుంది.
ఈ చిత్రంలో మానుషి చిల్లర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌తో ఇప్పటికే దూసుకుపోతున్నారు వరుణ్ తేజ్.
ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక ఫిబ్రవరి 25న హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్స్‌లో జరగనుంది. దీనికి ముఖ్య అతిథిగా చిరంజీవి హాజరు కానున్నారు.
గీతాంజలి హిట్ అవ్వడంతో.. దానికి సీక్వెల్ చేసారు దర్శక నిర్మాతలు. హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీజర్ విడుదలైంది.
ఈ టీజర్‌లో శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, కమెడియన్ సత్య, షకలక శంకర్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. వాళ్లతో పాటు అదనంగా సునీల్ కూడా ఉన్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి