రకుల్ ప్రీత్ పెళ్లి కబురు.. హనుమాన్‌ సినిమాటిక్ యూనివర్స్..

03 January 2024

TV9 Telugu

రకుల్ ప్రీత్ సింగ్ 2024లోనే పెళ్లి చేసుకోబోతున్నారు. కొన్నేళ్లుగా బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్నారు రకుల్. ఈ విషయాన్ని వాళ్లే అధికారికంగా ప్రకటించారు.

తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఫిబ్రవరి 22న ఈ ఇద్దరూ పెళ్లి పీటలెక్కబోతున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే పూర్తి వివరాలు బయటికి రానున్నాయి.

ప్రశాంత్ వర్మ నమ్మకం మామూలుగా లేదు. సంక్రాంతికి 5 సినిమాలు వస్తున్నా హనుమాన్ దుమ్ము దులిపేస్తుందని బలంగా నమ్ముతున్నారు ప్రశాంత్.

ఇదిలా ఉంటే తాజాగా తన సినిమాటిక్ యూనివర్స్ గురించి చెప్పుకొచ్చారు ఈ దర్శకుడు. హనుమాన్‌తో పాటు మొత్తం 12 సినిమాలు ఉంటాయి అన్నారు.

తర్వాతి భాగం అధీరాతో కొనసాగుతుందని, మూడోది ఫిమేల్ ఓరియెంటెడ్‌గా ఉంటుందని.. అన్నీ ఫాంటసీ నేపథ్యంలోనే ఉంటాయని చెప్పుకొచ్చారు ప్రశాంత్ వర్మ.

అత‌డు, ఖ‌లేజా లాంటి క్లాసిక్ సినిమాల తర్వాత మ‌హేష్ బాబు, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో వస్తున్న సినిమా ‘గుంటూరు కారం’.

దీనిపై ఉన్న అంచనాలు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సంక్రాంతి సీజ‌న్‌లో విడుద‌ల కావ‌డం మ‌రింత ప్లస్ కానుంది.

ఇదిలా ఉంటే ఈ చిత్రం నుంచి విడుదలైన కుర్చీ మడతబెట్టి సాంగ్‌కు అనూహ్య స్పందన వస్తుంది. రెండు రోజులుగా యూ ట్యూబ్‌లో నెంబర్ 1 ట్రెండ్ అవుతుంది ఈ పాట.