TV9 Telugu
రకుల్ పెళ్లి ముచ్చట.. భీమా టైటిల్ సాంగ్..
23 Febraury 2024
రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ పెళ్లి గోవాలో ఘనంగా జరిగింది. గత కొన్నాళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు.
పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరై.. నూతన జంటను ఆశీర్వదించారు. చాలా కొద్ది మందికి మాత్రమే రకుల్ పెళ్లి ఆహ్వానం అందింది.
త్వరలోనే ఇండస్ట్రీ మొత్తానికి రిసెప్షన్ ఘనంగా ఏర్పాటు చేయనున్నారు స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ జంట.
కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్‌లో లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ నిర్మిస్తున్న సినిమా ఇండియన్ 2.
సమ్మర్ తర్వాత విడుదల కానున్న ఈ సినిమా తెలుగు వర్షన్ నైజాం హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ ఎల్ పి భారీ ధరకు దక్కించుకున్నారు.
గోపీచంద్ హీరోగా ఏ హర్ష తెరకెక్కిస్తున్న యాక్షన్ డ్రామా చిత్రం భీమా. ఇందులో పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు గోపీచంద్.
మార్చ్ 8న విడుదల కానుంది ఈ చిత్రం. తాజాగా ఈ చిత్ర టైటిల్ సాంగ్ విడుదలైంది. కేజియఫ్ ఫేమ్ రవి బస్రూర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
ప్రియా భవాని శంకర్, మాళవిక శర్మ ఈ మూవీ హీరోయిన్లు. నిహారిక కొణిదెల ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి