పెళ్ళైనా తగ్గేదే లే.. అందాలతో అదరగొడుతున్న రకుల్ 

TV9 Telugu

08 June 2024

 టాలీవుడ్ లో ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. 

కెరటం అనే సినిమాతో పరిచయమైన రకుల్, వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఆతర్వాత వరుసగా సినిమాలు చేసి బిజీగా మారిపోయింది. తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ తెచ్చుకుంది. 

అలాగే స్టార్ హీరోల సినిమాల్లోనూ నటించింది. టాలీవుడ్ లో దాదాపు అందరు హీరోల సినిమాల్లో చేసింది. 

తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లోనూ కనిపించింది ఈ అమ్మడు. ఇక ఇప్పుడు తెలుగు సినిమాలు తగ్గించింది. 

ఇటీవలే రకుల్ పెళ్లి చేసుకుంది.జాకీ భ‌గ్నానీ పెళ్లి చేసుకొని కొత్త జీవితం మొదలు పెట్టింది రకుల్. 

అయితే పెళ్లినా కూడా రకుల్ ఎక్కడా తగ్గడంలేదు. అందాలు ఆరబోస్తూ కొన్ని ఫోటోలు వదిలింది ఈ చిన్నది.