10 October 2025
సినిమాలకు దూరంగా రకుల్.. అయినా తగ్గని ఆస్తులు.. ఎన్ని కోట్లంటే..
Rajitha Chanti
Pic credit - Instagram
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు చక్రం తిప్పిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. తెలుగులో స్టార్ హీరోస్ అందరి సరసన నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.
కానీ కొంతకాలంగా ఆమె సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. నిర్మాత జాకీ భగ్నానీతో పెళ్లి తర్వాత పూర్తిగా ఇండస్ట్రీలో సైలెంట్ అయ్యింది రకుల్.
కొన్నాళ్లుగా హిందీలో సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంది రకుల్. ఈరోజు (అక్టోబర్10)న ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా అభిమానులు విషెస్ తెలుపుతున్నారు.
తెలుగులో అనేక హిట్ చిత్రాల్లో నటించి తనదైన ముద్రవేసింది రకుల్. 2009లో 18 సంవత్సరాల వయసులో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది రకుల్.
గణితంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆ తర్వాత ఫ్యాషన్ ప్రపంచంపై ఆసక్తి పెంచుకుంది. నెమ్మదిగా సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ గుర్తింపు తెచ్చుకుంది.
నివేదికల ప్రకారం రకుల్ ఒక్క సినిమాకు రూ. 3 కోట్లు తీసుకుంటుంది. అలాగే బ్రాండ్ ప్రమోషన్, ప్రకటనల ప్రచారాలలో కూడా పాల్గొంటుంది రకుల్.
రకుల్ వద్ద చాలా ఖరీదైన కార్లు ఉన్నాయి. మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఇ - రూ. 1 కోటి, రేంజ్ రోవర్ స్పోర్ట్స్ - రూ. 70 లక్షలు, BMW 520D - రూ. 75 లక్షలు
ఆడి క్యూ3 - రూ. 35 లక్షలు, మెర్సిడెస్-మేబ్యాక్ GLS600 – రూ. 2.96 కోట్లు ఉన్నాయి. నివేదికల ప్రకారం ఆమె ఆస్తులు రూ.49 కోట్లు ఉన్నట్లు సమాచారం.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్