TV9 Telugu

రజినీ స్పీడ్.. బాలీవుడ్‌ కింగ్‌ రెడీ.. 

29 Febraury 2024

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ మామూలు స్పీడ్‌లో లేరు. ప్రస్తుతం ఈయన వరస సినిమాలు చేస్తూనే ఉన్నారు.

ప్రస్తుతం దర్శకుడు టి జి జ్ఞ్యానవేల్‌తో రజిని చేస్తున్న వెట్టైయాన్ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది.

దీని తర్వాత సంచలన దర్శకుడు లోకేష్ కనగరాజ్ లైన్‌లో ఉన్నారు. ఇది తలైవా కెరీర్ లో 171వ సినిమాగా రానుంది.

దీని తర్వాత బాలీవుడ్ నిర్మాత సాజిద్ నడియావాలాతో ఓ సినిమా చేయడానికి రజినీకాంత్ ఒప్పుకున్నట్లు తెలుస్తుంది.

గత ఏడాది హ్యాట్రిక్‌ హిట్స్ ఇచ్చిన షారూఖ్ ఖాన్‌, చిన్న విరామం తరువాత మళ్లీ కెమెరా ముందుకు వచ్చేస్తున్నారు.

ఇప్పడు ఆయన గారాల కూతురు సుహానా ఖాన్ తో కలిసి ఓ సినిమా చేస్తున్నాట్టు తెలిపారు బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్.

సుజయ్‌ ఘోష్ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాకు కింగ్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు మూవీ మేకర్స్.

కింగ్ కోసం హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ వర్క్‌ చేస్తున్నారు. మరిన్ని విషయాలు త్వరలో వెల్లడించనున్నారు.