సొంతగడ్డపై తలైవా అరుదైన రికార్డు.. !

09 September 2023

సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ మూవీ రికార్డులు తిరగరాస్తోంది. ఈ చిత్రంతో కోలీవుడ్‌లో మరోసారి తలైవా తన సత్తాను చాటారు.

జైలర్ మూవీ నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే రూ.630 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది.

అటు తలైవా సొంత గడ్డ తమిళనాడులోనూ రాష్ట్ర వ్యాప్తంగా జైలర్ సినిమా భారీ కలెక్షన్ల సునామీ కొనసాగుతోంది.

కోలీవుడ్ ఇండస్ట్రీలో తనకు ఇతర హీరోలు ఎవరూ  దరిదాపుల్లో లేరని ఈ మూవీతో ప్రూవ్ చేసుకున్నారు రజనీకాంత్.

ఒక్క తమిళనాడులోనే దాదాపు 900 థియేటర్లలో ఆగస్టు 10న జైలర్ రిలీజ్ కాగా.. ఇంకా చాలా థియేటర్స్‌లో ఈ సినిమా షోలను కొనసాగిస్తున్నారు.

కలెక్షన్ల పరంగా తమిళనాడులో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా ఓ ప్రత్యేక ఘనత సాధించింది.

తమిళనాడులో జైలర్ ఏకంగా రూ.100 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. దీంతో ఆ రాష్ట్రంలో రూ.100 కోట్ల మైలురాయిని చేరుకున్న తొలి భారతీయ సినిమాగా జైలర్ రికార్డు సృష్టించింది.

ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో జైలర్ మూవీ స్ట్రీమింగ్‌ అవుతోంది. ఓటీటీలోనూ తలైవా మూవీ మరిన్ని రికార్డులు క్రియేట్ చేయనుంది.