12-02-2024
నిమిషానికి కోటి రూపాయలు.. తగ్గేదేలే అంటున్న రజినీ
TV9 Telugu
సూపర్ స్టార్ రజనీకాంత్‌కి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఆయన వయసు 73 ఏళ్లు. అయినా కూడా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు
సూపర్ స్టార్.
గతేడాది రజనీకాంత్ నటించిన ‘జైలర్’ చిత్రం విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత వారి డిమాండ్ మరింత పెరిగింది.
జైలర్ సినిమా ఏకంగా 700కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.
ఇప్పుడు ఆయన నటించిన ‘లాల్ సలామ్’ చిత్రం ఫిబ్రవరి 9 న విడుదలై ఎవరేజ్
టాక్ తెచ్చుకుంది.
ఇక ఈ క్రమంలోనే ఈ సినిమాకు రజనీకాంత్ ఎంత పారితోషికం తీసుకున్నారనే ప్రశ్న
అందర్లో తిరుగుతోంది.
సినిమాలో ఆ పాత్ర దాదాపు 40 నిమిషాల పాటు ఉంటుందని సమాచారం. అందుకు గాను ఆయన 40 కోట్లు రెమ్యునరేషన్గా అందుకున్నారని కోలీవుడ్ టాక్.
ఇక్కడ క్లిక్ చేయండి