రజనీకాంత్ నెక్స్ట్ సినిమా షూటింగ్ లొకేషన్ లో కెరీర్ ఎర్లీ డేస్‌ను దాదాపు 46 క్రితం జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుంటూ సెట్‌లో మురిసిపోతున్నారు.
జైలర్ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయిన రజనీకాంత్ స్పీడు పెంచారు. ఆ సినిమా సక్సెస్ వేవ్ కంటిన్యూ అవుతుండగానే నెక్ట్స్ మూవీని లైన్ పెట్టారు.
జై భీమ్ సినిమాతో నేషనల్ లెవల్‌లో పేరు తెచ్చుకున్న టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో ఓ సినిమా స్టార్ట్ చేశారు తలైవా.
కేరళలో తొలి షెడ్యూల్ పూర్తి చేసిన తలైవా 170 టీమ్, ప్రజెంట్ తమిళనాడులోని తిరునల్వేలి ప్రాంతంలో షూటింగ్ చేస్తోంది.
ఈ షెడ్యూలే రజనీని నాస్టాలజిక్ మూడ్‌లోకి తీసుకెళుతోంది. దాదాపు 46 ఏళ్ల తరువాత తిరునల్వేలిలో షూటింగ్ చేస్తున్నారు తలైవా.
కెరీర్ స్టార్టింగ్‌లో ముత్తు రామన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'భువన ఒరు కెల్వి కురి' అనే సినిమా షూటింగ్ తిరునల్వేలిలో జరిగింది.
అప్పటి వరకు యాంటీ హీరోగా ఉన్న రజనీకాంత్‌కు ఈ సినిమా హీరో ఇమేజ్ తెచ్చిపెట్టింది. అందుకే తలైవా కెరీర్‌లో ఆ మూవీ, ఆ మూవీ షూట్ చేసిన లొకేషన్స్ చాలా స్పెషల్.
ఇన్నేళ్ల తరువాత మరోసారి అదే ప్లేస్‌లో అడుగు పెట్టడంతో అప్పటి రోజులను గుర్తు చేసుకుంటున్నారు రజనీకాంత్.