రజినీ ఎమోషనల్ పోస్ట్.. నాని మూవీపై సస్పెన్స్..
TV9 Telugu
10 February 2024
కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లాల్ సలామ్ తాజాగా శుక్రవారం విడుదలైంది.
ఈ మూవీ విడుదల సందర్భంగా కూతురుతో ఉన్న ఒక ఫోటోను షేర్ చేసారు రజినీ. ఐశ్వర్యతో ఉన్న ఈ ఫోటో వైరల్ అవుతుంది.
తన తల్లి ఐశ్వర్య అంటూ రజినీకాంత్ ఎమోషనల్ పోస్ట్ పెట్టడంతో ఫ్యాన్స్ ఈ ఫోటోను తెగ వైరల్ చేస్తున్నారు.
వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ జంటగా కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ తెరకెక్కించిన సినిమా ఆపరేషన్ వాలంటైన్.
ఈ సినిమా మార్చ్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి.
తాజాగా ముంబైకి వెళ్లిన చిత్ర యూనిట్.. అక్కడ సినిమాను ప్రమోట్ చేసుకున్నారు. తెలుగు, హిందీలో విడుదల కానుంది ఆపరేషన్ వాలంటైన్.
నాని హీరోగా తర్వాతి సినిమాపై సస్పెన్స్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఆయన ఎంచుకునే కథలు, దర్శకులు భిన్నంగా ఉంటాయి.
ఈ క్రమంలోనే ‘బలగం’ ఫేమ్ వేణు యెల్దండితోనే నాని నెక్ట్స్ సినిమా చేయబోతున్నట్లు చాలా రోజులుగా చర్చ జరుగుతుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి