31 August 2023

జైలర్‌కు బిగ్ షాక్ !!

దాదాపు 600 కోట్ల వసూళ్లు.. ఇంకా థియేటర్ల వైపే ఈసినిమా చూసేందుకు పరిగెడుతున్నజనాలు.. కలెక్షన్లు ఇంకా వస్తూనే ఉన్నాయి కోట్లకు కోట్లు.

కట్ చేస్తే జైలర్‌కు తగిలింది దిమ్మతిరిగే షాకు..! దీంతో మేకర్స్‌తో పాటు రజినీ కూడా అయ్యారు షేకు. 

ఎస్ ! ఆఫ్టర్ కంటిన్యూవస్ ప్లాప్స్‌,.. నెల్సన్ డైరెక్షన్లో.. రజినీ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ జైలర్కు బిగ్ షాక్ తగిలింది.

ఈ మూవీ థియేటర్లలో స్టేబుల్‌గా రన్ అవుతున్న వేళ... ఈ మూవీ ఫుల్ హెచ్‌డీ ప్రింట్ నెట్టింట ప్రత్యక్షమైంది. దాంతో పాటే.. ఓవర్ నైట్ నెట్టింట విపరీతంగా వైరల్ అయింది.

ఇక సన్ పిక్చర్స్ ప్రొడ్యూస్‌ చేసిన ఈ మూవీ ఆగస్ట్ 10న రిలీజ్ అయింది. మరికొన్ని రోజుల్లో సన్ నెక్ట్ ఓటీటీతో పాటు.. మరో ఓటీటీలో కూడా స్ట్రీమ్ అవనుంది.

ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ ఫుల్ హెచ్‌డీ ప్రింట్ ఎలాంటి వాటర్‌ మార్క్‌ లేకుండా.. నెట్టింట ప్రత్యక్షమైంది.

తమిళ్ రాకర్స్, టోరెంట్స్, మూవీ రూల్స్ లాంటి పైరేటెడ్ సైట్స్‌లో.. అందుబాటులోకి వచ్చి... రికార్డ్‌ లెవల్‌ డౌన్‌లోడ్స్‌తో ట్రెండ్ అవుతోంది జైలర్ మూవీ.

అయితే ఓటీటీ రిలీజ్‌కు ముందే.. థియేటర్లో ఇంకా పొటెన్షియల్ కలెక్షన్స్ రాబడుతున్న రజినీ మూవీ ఇలా.. లీకవడం.. ఆ మూవీ మేకర్స్‌ ను షాకయ్యేలా చేస్తోంది.