ఆ సక్సెస్ ఫార్ములానే నెక్ట్స్ సినిమాల్లోనూ యూజ్ చేయనున్న రజినీ..

04 October 2023

జైలర్‌కు వర్కవుట్ అయిన ఆ ఫార్ములానే నెక్ట్స్ సినిమాల్లోనూ కంటిన్యూ చేయాలని చూస్తున్నారు సూపర్ స్టార్. మరి రజినీ తీసుకుంటున్న ఆ జాగ్రత్తలేంటి..?

జైలర్ సక్సెస్ తర్వాత రజినీకాంత్‌లో జోష్ పదింతలు పెరిగిపోయింది. తన మార్కెట్ తగ్గిందేమో.. ఒకప్పట్లా తన సినిమాలు ఆడియన్స్ చూడట్లేదేమో అనే అనుమానాలు జైలర్ విజయానికి ముందు వచ్చే ఉంటాయి.

కానీ ఒక్క హిట్‌తో మ్యాటర్ సెటిల్ అయిపోయింది. ఏం ప్రాబ్లమ్ లేదు.. మనల్ని ఇంకా ఆడియన్స్ కావాలయ్యా అంటున్నారని క్లారిటీ వచ్చేసింది.

వరస సినిమాలతో ప్రస్తుతం బిజీగా ఉన్నారు రజినీ. ఇప్పటికే జై భీమ్ ఫేమ్ జ్ఞానవేల్‌తో పాటు లోకేష్ కనకరాజ్ సినిమాలను కన్ఫర్మ్ చేసారు.

అయితే ఈ రెండు సినిమాల కాస్టింగ్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉన్నారు రజినీకాంత్. జైలర్‌లో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ లాంటి స్టార్స్ ఉన్నారు.

తలైవా 170లోనూ అమితాబ్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, రితికా సింగ్, మంజు వారియర్ లాంటి స్టార్స్ ఉన్నారు.

తలైవా 170 షూటింగ్ తాజాగా త్రివేండ్రంలో మొదలైంది. అక్కడి వెల్లయాని అగ్రికల్చరల్ యూనివర్సిటీలో సీన్స్ చిత్రీకరిస్తున్నారు జ్ఞానవేల్.

రజినీ కూడా జాయిన్ అయ్యారు సెట్స్‌లో. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నారు. కచ్చితంగా ఇది మరో సెన్సేషన్ అవుతుందని నమ్ముతున్నారు సూపర్ స్టార్.