టీజర్ అదిరింది గురూ!

TV9 Telugu

24 April 2024

తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్నట్టు తెలిసిందే.

సన్ పిక్చర్ పతాకంపై కళానిధి మారన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. దీనికి అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.

ఇటీవల తలైవర్ 171 సినిమా గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్నట్లు తెలిపారు చిత్ర దర్శక నిర్మాతలు.

తాజాగా మార్చ్ 21న ఈ చిత్రం టైటిల్ ను ఫిక్స్ చేసారు మూవీ మేకర్స్. ఈ సినిమా కూలీ అనే అదిరిపోయే టైటిల్ ఖరారు చేసారు.

తర్వాత రోజు అంటే మార్చ్ 22న కూలీ సినిమా టీజర్ కూడా యూట్యూబ్ వేదికగా విడుదల చేసారు ఈ చిత్ర దర్శక నిర్మాతలు.

బ్లాక్‌ అండ్‌ గోల్డ్ థీమ్‌తో డిజైన్‌ కూలీ మూవీ టీజర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంది. లోకేష్ అంటే ఇది అంటున్నారు ఫ్యాన్స్

యాక్షన్‌, డైలాగులతో పాటు టీజర్‌లో సూపర్ సూపర్ స్టార్ లుక్స్ కూడా సినీ ప్రేమికులను ఆకట్టుకుంటున్నాయి.

సినిమా కూడా ఇదే రేంజ్లో ఉంటే రికార్డులు బద్ధలు కొట్టడం ఖాయం అని అంటున్నారు సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులు.