అందుకే నిర్మించలేదన్న తలైవా.. రూమర్స్‌కు చెక్‌ పెట్టిన ఐశ్వర్య..

TV9 Telugu

07 February  2024

కోలీవుడ్ సూపర్ స్టార్‌ రజనీకాంత్ కీలక పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా మూవీ లాల్‌ సలాం.

రజినీకాంత్ కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహించిన లాల్‌ సలాం సినిమా గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు రజనీ.

కూతురు ఐశ్వర్య కోసం లాల్ సలాం సినిమాను రజనీకాంత్ నిర్మించాల్సిందన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపించాయి.

ఆ కామెంట్స్‌పై స్పందించిన సూపర్ స్టార్‌, బాబా సినిమా తరువాత నిర్మాతగా వ్యవహరించకూడదని నిర్ణయించుకున్నా అన్నారు.

కొద్ది రోజులుగా సోషల్ మీడియా వేదికగా బచ్చన్ ఫ్యామిలీకి సంబంధించి రకరకాల వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.

ముఖ్యంగా అభిషేక్‌, ఐశ్వర్య విడిపోయారని, డైవర్స్‌కు సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయన్న టాక్ వినిపించింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తలకు తాజాగా చెక్‌ పెట్టారు విశ్వ సుందరి, హీరోయిన్ ఐశ్వర్య రాయ్‌ బచ్చన్.

అభిషేక్‌ బర్త్‌ డే సందర్భంగా అతనితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు. దీంతో డైవర్స్ రూమర్స్‌కు చెక్‌ పడింది.