రాజన్న మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ యాని.. ఇప్పుడు హీరోయిన్ మెటీరియల్..

Anil Kumar

23 June 2024

సినీ ఇండస్ట్రీలో చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ లు ఇప్పుడు హీరోలుగా, హీరోయిన్స్ గా మారి సినిమాలు చేస్తున్నారు.

ఇటీవలే తేజ సజ్జ కూడా హీరోగా రాణిస్తున్నాడు, కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా.. ఇప్పుడు " బేబీ యాని" కూడా..

ఇంతకీ ఎవరా బేబీ యాని అనుకుంటున్నారా.! అదేనండీ.. అక్కినేని నాగార్జున నటించిన రాజన్న సినిమాలో మల్లమ్మ..

ఈ సినిమాలో నాగార్జున కూతురు మల్లమ్మ పాత్రలో నటించిన ఈమె.. ఈ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది యాని.

దానికంటే ముందు 'అనుకోకుండా ఒక రోజు' సినిమా తో చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ అమ్మడు.

చూడటానికి చైల్డ్ ఆర్టిస్ట్ అయ్యినప్పటికీ ఇప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతుంది ఈ వయ్యారి.

తాజాగా మీడియాకు కనిపించిన ఈ చిన్నది హీరోయిన్ లుక్ లోకి మారిపోయింది. చూడముచ్చటగా ఎంతో క్యూట్ గా ఉంది యాని.

ఇక సోషల్ మీడియా సైతం ఈ అమ్మడి ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. యాని పేరు ఫేసే చాలామందికి గుర్తుంది.