రాజమౌళి సినిమాలో మమిత జైజు !! 

TV9 Telugu

21 June 2024

ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు వస్తుంటారు వెళ్తుంటారు.. కాని ఇండస్ట్రీ మెచ్చిన కొంత మంది మాత్రమే అందరికి గుర్తుంటారు.

అందులోనూ..రాజమౌళి లాంటి దర్శకుడు మెచ్చిన హీరోయిన్ అంటే.. ఆమెకు డిమాండ్ గట్టిగా పెరిగినట్టే.. తాజాగా ఓ మలయాళ హీరోయిన్ ను మెచ్చుకున్నారట జక్కన్న.

ఆమె నటకు ఫిదా అయ్యారట. మరి జక్కన్నను ఇంప్రెస్ చేసిన హీరోయిన్ ఎవరు..? ఆహీరోయిన్ మరెవరో కాదు.. మమిత జైజు.

 ప్రేమలు సినిమాలో మమిత బైజు క్యూట్ క్యూట్ నటనకు ఆడయన్స్ తో పాటు.. సెలబ్రిటీలు కూడా పడిపోయారట. మరీ ముఖ్యంగా రాజమౌళి సైతం ఫిదా అయిపోయారట.

ఈ సినిమా చూసిన జక్కన్న ఆ అమ్మాయి బాగా చేసిందంట కితాబిచ్చారని అంటున్నారు. మరి రాజమౌళి తన సినిమాలో ఏదో ఒక పాత్ర ఇవ్వకపోతారా అని అందరు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఇక ఇప్పుడిప్పుడే తెలుగులో ఆఫర్లు అందుకుంటుంది మమిత బైజు. ఇతర భాషల్లలో కూడా ఆమెకు అవకాశాలువస్తున్నాయి.

ఈ క్రమంలోనే ఆమెకు సినిమాలతో పాటు.. ఫేమస్ కంపెనీల నుంచి యాడ్స్ చేయడానికి అవకాశాలు వస్తున్నాయి. మలయాళంలో ఇప్పటికే యాడ్స్ లో నటిస్తూ.. చేతినిండా సంపాదించుకుంటుంది మమిత.