ఫ్యాన్స్ కోసం లారెన్స్ కీలక నిర్ణయం.. అకిరా కొత్త ఫోటో వైరల్..
25 Febraury 2024
ఈ మధ్య చెన్నైలో ఓ ఫోటో షూట్ కోసం లారెన్స్‌ను కలవడానికి వచ్చిన అభిమాని చనిపోయాడు. ఓ ప్రమాదంలో లారెన్స్ ఫ్యాన్ కన్నుమూసాడు.
దాంతో ఇక మీద తన కోసం ఫ్యాన్స్ రావద్దని తెలిపారు లారెన్స్. మీ కోసం నేనే వస్తానని చెప్పారు లారెన్స్. అభిమానుల జీవితాల కోసం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపారు.
నిమిషా సజయన్, రోషన్ మ్యాథ్యూ కీలక పాత్రల్లో రిచి మెహతా తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ పోచెర్. ఏనుగు దంతాల నేపథ్యంలో ఈ సిరీస్ తెరకెక్కింది.
ఫిబ్రవరి 23 నుంచి ప్రముఖ ఓటిటిలో స్ట్రీమ్ అవుతుంది పోచెర్. భారీ బడ్జెట్‌తో ఈ వెబ్ సిరీస్ నిర్మించారు.
టబు, కరీనా కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా క్య్రూ. కార్పోరేట్ ఏవియేషన్ బిజినెస్ నేపథ్యంలో ఈ సినిమా వస్తుంది.
ఓ విమానం హైజాకింగ్, దొంగతనం నేపథ్యంలో క్య్రూ సినిమా నడుస్తుంది. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదలైంది. సినిమా మార్చ్ 29న విడుదల కానుంది.
పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ కొత్త ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అకీరా న్యూ ఫోటోను షేర్ చేసిందెవరో కాదు.. రేణు దేశాయే.
హెడ్ సెట్ పెట్టుకుని ఉన్న అకీరా పోటో చూసి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్. కొన్ని నెలలుగా అకీరా ఫోటోలను రేణు దేశాయ్ స్వయంగా పోస్ట్ చేస్తున్నారు.