లారెన్స్ కాంచన-4 వస్తుంది.. రాసి పెట్టుకోండి ఈసారి మరింత ఎగ్జైట్మెంట్

Anil Kumar

07 June 2024

డాన్సర్ మాస్టర్ రాఘవ లారెన్స్ హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించి బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమా కాంచన.

ఇప్పటికే ఈ సినిమా ముని పేరుతో స్టార్ట్ అయ్యి వరస సీక్వల్స్ కాంచన , కాంచన 3 ఇప్పుడు కాంచన 4 వరకు వచ్చింది.

హారర్‌ మరియు కామెడీ కలిపినా జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద హిట్‌ టాక్ గా నిలిచాయి.

ఇక ఇప్పుడు ఈ చిత్రానికి నాలుగో భాగం షూటింగ్‌ ఈ ఏడాది సెప్టెంబర్‌లో మొదలవుతుంది అని ఇండస్ట్రీలో టాక్ ఉండేది.

ఇక దీనిపై ఈ ఏడాది సెప్టెంబర్‌లో షూటింగ్‌ స్టార్ట్ అవుతుంది అని అధికారకంగా ప్రకటించేసారు ఈ మూవీ మేకర్స్.

ఇక వచ్చే ఏడాది అనగా 2025 వేసవికి ఈ మూవీ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

ఇదిల ఉంటె డ్యాన్సర్‌గా కెరీర్ ఆరంభించిన రాఘవ లారెన్స్.. ఈరోజు తనని దేవుడిలా కొలిచేలా అంచెలంచులగా ఎదిగాడు.

నేటికీ తన సంపాదనతో ఎంతోమందికి సాయం అందిస్తూ.. కొన్ని కోట్లమందికి ఇన్‌స్పిరేషన్ గా నిలిచారు రాఘవ లారెన్స్.