ఓటీటీలోకి రానున్న రాశీ ఖన్నా సూపర్ హిట్ మూవీ

TV9 Telugu

10 June 2024

రాశీఖన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జాన్ అబ్రహాం హీరోగా నటించిన మద్రాస్ కేఫ్ సినిమాతో వెండితెరకు పరిచయమైంది.

తరువాత 'ఊహలు గుసగుసలాడే' సినిమాలో హీరోయిన్ గా నటించి తెలుగు చిత్ర సీమకి పరిచయం అయింది. తన నటన తో అందరిని ఆకట్టుకుంది.

తెలుగులో కూడా తన ఫస్ట్ సినిమా హిట్ అవ్వడంతో  టాలీవుడ్ లో బాగానే అవకాశాలు వచ్చాయి ఈ ముద్దుగుమ్మ రాశీఖన్నాకు.

‘బెంగాల్ టైగర్’, ‘సుప్రీమ్’, ‘జై లవ కుశ’, ‘తొలి ప్రేమ’, ‘వెంకీ మామ’, ‘ప్రతిరోజూ పండగే’ సినిమాలతో తెలుగులో స్టార్ హీరోయిన్ అయిపోయింది.

అయితే తాజాగా రాశీఖన్నా హీరొయిన్ గా నటించిన అరణ్మణై 4 మూవీ తమిళంలో సూపర్ హిట్ గా నిలించింది. బాక్సాఫీస్ వద్ద 100 కోట్లు కలెక్ట్ చేసింది.

చాలా గ్యాప్ తరువాత  అరణ్మణై 4 తో రాశీఖన్నా సూపర్ హిట్ మూవీ ఒకటి తన ఖాతాలో పడిందనే చెప్పాలి. అయితే ఈ సినిమాలో రాశీఖన్నా తో పాటు తమ్మన్న కూడా నటించింది.

ఇది ఇలా ఉంటే అరణ్మణై 4  స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. జూన్ 21 న ఈ సినిమా డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతుంది.