తన సొగసుతో మన్మధుడిని కూడా తన వెంట తిప్పుకుంటుంది ఈ భామ..

TV9 Telugu

15 June 2024

30 నవంబర్ 1990 సంవత్సరంలో భారతదేశ రాజధాని ఢిల్లీ మహా నగరంలో పుట్టి పెరిగింది వయ్యారి భామ రాశి ఖన్నా.

ఢిల్లీలోని సెయింట్ మార్క్స్ సీనియర్ సెకండరీ పబ్లిక్ స్కూల్‌లో పాఠశాల విద్యను అభ్యసించింది ఈ ముద్దుగుమ్మ.

ఢిల్లీ నగరంలోని లేడీ శ్రీ రామ్ కాలేజీ నుంచి ఆంగ్లంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టా పొందింది ఈ అందాల తార.

చదువుపై ఎక్కువ ఆసక్తి కనబరిచింది. నటనలో కెరీర్ మొదలుపెట్టకముందు IAS అధికారి కావాలని ఆకాంక్షించింది ఈ వయ్యారి.

ఆమెకు మోడలింగ్‌పై ఆసక్తి లేదని, నటి కావాలని ఆలోచన కూడా లేదని కానీ విధి ఆమెను నటిగా మార్చిందని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

కళాశాల రోజుల్లో ప్రకటనల కోసం కాపీ రైటింగ్‌ ప్రయత్నించింది. చలనచిత్రాలకు ముందు వివిధ ప్రకటనలలో నటించింది.

2014లో నాగ శౌర్య సరసన ఊహలు గుసగుసలాడే అనే చిత్రంతో తెలుగులో కథానాయకిగా అరంగేట్రం చేసింది ఈ అందాల భామ.

జిల్, బెంగాల్ టైగర్, సుప్రీం, హైపర్, జై లవ కుశ వంటి సినిమాలతో తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ అయిపొయింది.