ప్లీజ్.. దయ చేసి ఆ ఒక్కటి అడగొద్దు: రాశీ ఖన్నా

TV9 Telugu

03 April 2024

బాలీవుడ్ తో మొదలై టాలీవుడ్, కోలీవుడ్. .ఇలా అన్నీ సినీ పరిశ్రమలను చకా చకా చుట్టేసింది అందాల తాన రాశీ ఖన్నా.

ముఖ్యంగా తెలుగులో ఈ అమ్మడికి మంచి క్రేజ్ వచ్చింది. స్టార్ హీరోలతో కలిసి పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది.

అయితే ఎందుకోగానీ రాశీ ఖన్నాకు స్టార్ హీరోయిన్ స్టేటస్ రాలేదు. అందుకే ఇప్పుడు కూడా అవకాశాల కోసం ఎదురుచూడాల్సి పరిస్థితి.

గతంలో పోల్చితే తెలుగులో సినిమాలు చేయడం బాగా తగ్గించేసింది రాశీ ఖన్నా. గోపీచంద్ తో కలిసి పక్కా కమర్షియల్ అనే సినమాలో ఫుల్ లెంగ్త్ రోల్ చేసింది.

ఆ తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన తిరు సినిమాలో ఓ క్యామియో రోల్ లో తళుక్కుమంది. ఇందులో నిత్యా మేనన్ మెయిన్ హీరోయిన్.

ఈ మధ్యన బాలీవుడ్ లో ఒక సినిమా చేసినా రాశీ ఖన్నాకు నిరాశే మిగిలింది. ఈ మూవీ కూడా ప్లాఫ్ సినిమాల ఖాతాలో చేరిపోయింది.

దీనిపై స్పందించిన రాశీ ఖన్నా తనకు కూడా బాహుబలి లాంటి సినిమాలు చేయాలనుందని మనసులో మాట బయట పెట్టింది.

ఇక పెళ్లి విషయంపై అడిగితే మాత్రం 'ప్లీజ్.. దయచేసి  ఆ ఒక్కటి అడగొద్దు' అంటూ పక్కకు తప్పించుకుంటోందీ అందాల తార.