అందం, క్యూట్ నెస్ కలగలిపితే ఈ భామ.. పట్టు చీరలో పుత్తడిబొమ్మలా రాశి..
05 October 2023
2013లో పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మద్రాస్ కేఫ్ అనే హిందీ చిత్రంతో వెండితెరకి పరిచయం అయింది రాశి ఖన్నా.
తర్వాత 2014లో మనం చిత్రంలో ఓ చిన్న పాత్రలో కనిపించింది. నాగ శౌర్యకి జోడిగా ఊహలు గుసగుసలాడే చిత్రంతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అయింది.
తర్వాత రొమాంటిక్ కామెడీ చిత్రం జోరులో సందీప్ కిషన్ సరసన కథానాయకిగా మెప్పించింది వయ్యారి భామ రాశి ఖన్నా.
తన అందంతో, క్యూట్ నెస్ తో కుర్రాళ్లను ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. స్టార్ హీరోయిన్ అవడానికి ఎక్కువ కాలం పట్టలేదు.
జిల్, బెంగాల్ టైగర్, సుప్రీమ్, జై లవకుశ వంటి ఎన్నో హిట్ చిత్రాల్లో స్టార్ హీరోల పక్కన హీరోయిన్ గా ఆకట్టుకుంది.
మోహన్ లాల్, విశాల్ ప్రధాన పాత్రల్లో నటించిన విలన్ అని సినిమాతో మల్లువుడ్ ప్రేక్షకులకు పరిచయం అయింది ఈ బ్యూటీ.
ఊహలు గుసగుసలాడే, జై లవకుశ, తొలిప్రేమ, ప్రతిరోజూ పండగే, వెంకీ మామ చిత్రాల్లో తన నటనకు అవార్డులు కైవసం చేసుకుంది.
ఇమైక్క నోడిగల్ అనే చిత్రంతో కోలీవుడ్ అరంగేట్రం చేసింది. 2022లో కార్తీకి జోడిగా సర్దార్ చిత్రంతో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి