16 December 2023

ప్రాణాపాయం నుంచి బయటపడ్డ  పుష్ప ఫేం స్టార్ హీరో

శ్రేయాస్ తల్పడే! అంటే ఎవరికీ తెలియకపోవచ్చు..! 

మే జుకేంగే నహి సాలా.. అని పుష్ప సినిమాలోని డైలాగ్‌ను హిందీ వర్షన్‌లో చెప్పాడుగా ఆయనే ఈయన.

అయితే తాజాగా ఈయన చావు అంచుల దాకా వెళ్లి వచ్చారు. 

బాలీవుడ్‌లో స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న శ్రేయాస్‌కు హార్ట్‌ అటాక్ వచ్చిందని బాలీవుడ్‌  న్యూస్‌. 

అయితే సరైన టైంలో ట్రీట్మెంట్ అందడంతో.. ఆయన ప్రాణాపాయం నుంచి బయట పడ్డారట. 

ప్రస్తుతం నిలకడగానే తన ఆరోగ్య పరిస్థితి ఉందట. 

ఇదే విషయాన్ని ఆయన  వైఫ్‌ దీప్తి కూడా మీడియాతో చెప్పింది.

అంతేకాదు కష్ట కాలంలో.. తమకు అండగా నిలిచినందుకు.. అందరికీ స్పెషల్ థాంక్స్ అంది.