ఇంకో లెవల్లో అల్లు అర్జున్‌ డెడికేషన్‌.. కోలీవుడ్‌లో జాన్వీ చెల్లి ఖుషీ..

21 November 2023

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప 2 ది రూల్. పుష్ప 1 ది రైజ్ కి కొనసాగింపు చిత్రమిది.

పుష్ప సీక్వెల్‌ కోసం అల్లు అర్జున్‌ చూపిస్తున్న డెడికేషన్‌ ఇంకో లెవల్లో ఉందంటున్నారు యూనిట్‌ సభ్యులు.

ఇటీవల తెరకెక్కించిన జాతర సీక్వెన్స్ లో బన్నీ నటన చూసిన వారికి గూస్‌బంప్స్ వస్తాయని అంటున్నారు.

వచ్చే ఏడాది ఆగస్టు 15న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది పుష్ప 2 ది రైజ్. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

యంగ్‌ హీరో అధర్వతో జోడీ కట్టడానికి రెడీ అవుతున్నారు ఖుషీ కపూర్‌. లైకా ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ఇటీవల ఖుషీ కపూర్‌ సంతకం చేసినట్టు సమాచారం.

అక్క జాన్వీ కపూర్‌ తెలుగులో దేవరతో ఎంట్రీ ఇస్తుంటే, ఖుషి లైకా చిత్రంతో కోలీవుడ్‌లో పరిచయమవుతున్నారనే వార్త వైరల్‌ అవుతోంది.

విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మ ఒకరినొకరు సపోర్ట్ చేసుకునే తీరు చూస్తే ముచ్చటేస్తోందని అన్నారు నటి కత్రినా కైఫ్‌.

భార్యాభర్తలు ఒకరికొకరు కష్టసుఖాల్లో తోడుగా ఉండాలని, విరాట్‌, అనుష్కను చూసిన ప్రతిసారీ పర్ఫెక్ట్ కపుల్‌గా అనిపిస్తారని అన్నారు కత్రినా.