పుష్ప 2 టీజర్ స్పెషల్.. ఇండియన్ 2 కన్ఫర్మ్.. 

TV9 Telugu

07 April 2024

అల్లు అర్జున్ అభిమానుల ఆశలన్నీ ఇప్పుడు పుష్ప 2పైనే ఉన్నాయి. కొన్ని రోజులుగా పుష్ప 2 షూటింగ్ వేగంగా జరుగుతుంది.

నాన్ స్టాప్ షెడ్యూల్స్‌తో అనుకున్న తేదీకి ఔట్ పుట్ ఇచ్చే ప్రయత్నాలే చేస్తున్నారు చిత్ర దర్శకుడు సుకుమార్.

టీజర్ ఏప్రిల్ 8న బన్నీ బర్త్ డే రోజు విడుదల చేయబోతున్నారు. ఇందులో అల్లు అర్జున్ చీరతో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.

తెలుగు, తమిళంలో నటిస్తూ బిజీగా ఉన్న నటుడు ఎస్ జే సూర్య. దర్శకత్వానికి గ్యాప్ ఇచ్చేసి నటుడిగానే బిజీ అవుతున్నారీయన.

తాజాగా గేమ్ ఛేంజర్ సహా చాలా సినిమాల్లో నటిస్తున్నారు సూర్య. తాజాగా మలయాళంలోకి కూడా ఎంట్రీ ఇస్తున్నారు ఎస్ జే సూర్య.

ఫహాద్ ఫాజిల్ హీరోగా విపిన్ దాస్ తెరకెక్కిస్తున్న సినిమాలో సూర్య కీలక పాత్రలో నటించబోతున్నారు ఎస్ జే సూర్య.

నాలుగేళ్లుగా సెట్స్‌పైనే ఉన్న భారతీయుడు 2కి విముక్తి దొరకబోతుంది. పర్ఫెక్ట్ డేట్ అయితే చెప్పలేదు కానీ రిలీజ్ టైమ్ అయితే కన్ఫర్మ్ చేసారు దర్శక నిర్మాతలు.

జూన్‌లోనే ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ ఖరారవ్వడంతో.. మా గేమ్ ఛేంజర్‌కు లైన్ క్లియర్ అయిందని రామ్ చరణ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.