పుష్ప ఈ సారి ఇంకాస్త మాస్‌గా.. వెర్రిక్కిపోతున్న ఫ్యాన్స్
TV9 Telugu
08 April 2024
అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది పుష్ప 2 టీమ్. మోస్ట్ అవెయిటెడ్ టీజర్‌ను రిలీజ్ చేసింది యూనిట్.
గతంలో రిలీజ్ అయిన ప్రీ టీజర్‌లో బన్నీ లుక్‌ను కంప్లీట్‌గా రివీల్ చేయకుండా దాచిపెట్టిన మేకర్స్, లేటెస్ట్ టీజర్‌లో ఐకాన్ స్టార్ విశ్వరూపం చూపించారు.
టీజర్‌లో బన్నీ లుక్స్, మ్యూజిక్ ఇలా ప్రతీ అంశం ఆడియన్స్‌కు గూజ్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. స్పెషల్ కేర్ తీసుకొని సంగీతమందించారు డీస్పీ.
ఆస్కార్ విన్నర్ రసూల్ పోకుట్టి సౌండ్ డిజైన్ చేశారు. ఇప్పటికే పుష్ప మాస్ జాతార అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో టాప్‌లో ట్రెండ్ అవుతోంది.
టీజర్ రిలీజ్ తరువాత ఈ ట్రెండ్స్ నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు ఐకాన్ స్టార్ ఫ్యాన్స్.
పుష్ప పాన్ ఇండియా రేంజ్‌లో సూపర్ హిట్ కావటంతో సీక్వెల్ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా పార్ట్ 2ను రూపొందిస్తున్నారు.
బన్నీ కెరీర్‌లోనే హయ్యస్ట్ బడ్జెట్‌తో రూపొందుతోంది పుష్ప 2. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తి కావస్తుండటంతో పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో వేగం పెంచారు.
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 15న పుష్ప ది రూల్‌ను ఆడియన్స్ ముందుకు తీసుకురావలని ఫిక్స్ అయ్యారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి