పుష్పరాజ్ ఫ్యాన్స్ కి గూడ్ న్యూస్.. 

TV9 Telugu

26 May 2024

పుష్ప 2 ప్రమోషన్స్‌లో జోరు పెరిగిపోతుంది. తాజాగా రెండో సింగిల్‌కు సంబంధించిన ప్రకటన కూడా వచ్చేసింది.

మే 23 ఉదయం 11 గంటల 7 నిమిషాలకి ఈ సింగిల్‌కు సంబంధించిన అప్‌డేట్ ఇస్తున్నట్లు ఓ పోస్టర్‌ను విడుదల చేసారు దర్శక నిర్మాతలు.

ఇది మెలోడీ సాంగ్. సినిమాలో ఈ పాట వైరల్ అవుతుందని నమ్మకంగా చెప్తున్నారు మేకర్స్. దీని కోసం ఫ్యాన్స్ కూడా వేచి చూస్తున్నారు.

అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా తెరకెక్కుతున్న పుష్ప 2 ది రూల్ నుంచి రెండో పాటకు ముహూర్తం సెట్ అయింది.

ఈ చిత్ర ప్రమోషన్స్‌లో జోరు పెంచేసారు దర్శక నిర్మాతలు. తాజాగా రెండో సింగిల్‌కు సంబంధించిన ప్రకటన కూడా వచ్చేసింది.

మే 29 ఉదయం 11 గంటల 7 నిమిషాలకి ఈ సెకండ్ సింగిల్‌ విడుదల కానున్నట్లు తెలిపారు పుష్ప 2 ది రూల్ మూవీ మేకర్స్.

స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది పుష్ప 2 సినిమా.

ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ భరద్వాజ్, జగదీష్ ముఖ్య పాత్రధారులు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.