పుష్ప 2 రిలీజ్ వెనుక పెద్ద ప్లానే ఉందిగా..!

11 September 2023

పుష్ప చిత్రంలో తన నటనకు జాతీయ ఉత్తమ నటుడుగా అవార్డు సొంతం చేసుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.

దీనికి సీక్వెల్ గా పుష్ప 2 ది రూల్ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రేక్షకుల నిరీక్షణకు తెరదించుతూ పుష్ప 2 మూవీ విడుదల తేదీని అనౌన్స్ చేశారు మూవీ మేకర్స్. దీంతో పాటు ఓ పోస్టర్ కూడా షేర్ చేసారు.

ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్టు 15 ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఈ తేదీని ఎంచుకోవడం వెనుక బలమైన కారణమే ఉంది.

ఆగష్టు 15 గురువారం స్వతంత్ర దినోత్సవం సెలవు.. తర్వాత శుక్రవారం, శనివారం, ఆదివారం వీకెండ్ తరవాత ఆగష్టు 19 రాఖి.

ఏకంగా 5 రోజులు హాలిడేస్ కారణంగా కలెక్షన్ పరంగా దుమ్మురేపవచ్చని మేకర్స్ ఆ రోజు విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు.

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతుంది. జాతీయ అవార్డు కైవసం చేసుకున్న బన్నీ ఈ చిత్రీకరణలో మారింత చురుగ్గా పాల్గొంటున్నారు.

ఐదు రోజుల వరుస సెలవుల నేపథ్యంలో పుష్ప 2 కలెక్షన్ల సునామీ సృష్టించడం ఖాయమని బన్నీ ఫ్యాన్స్ ధీమా వ్యక్తంచేస్తున్నారు.