పుష్ప న్యూ లుక్..  ఫ్యామిలీ స్టార్ సక్సెస్ మీట్..

TV9 Telugu

07 April 2024

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న పాన్ ఇండియా భారీ యాక్షన్ డ్రామా సినిమా పుష్ప 2 ది రూల్.

పుష్ప 1 ది రైజ్ మూవీకి కొనసాగింపుగా వస్తున్న ఈ చిత్ర టీజర్ ఏప్రిల్ 8న బన్నీ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయబోతున్నారు.

ఈ ప్రమోషన్‌లో భాగంగానే తాజాగా మరో కొత్త లుక్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ అవుతుంది.

ఇందులో రష్మిక మందన్న హీరోయిన్. ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

విజయ్ దేవరకొండ, మృణాళ్ ఠాకూర్ జంటగా నటించిన రొమాంటిక్ యాక్షన్ ఫ్యామిలీ డ్రామా సినిమా ఫ్యామిలీ స్టార్.

పరశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో దిల్ రాజు ఈ సినిమాని నిర్మించారు.

ఏప్రిల్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఈ చిత్రానికి వస్తున్న స్పందన చూసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు దర్శక నిర్మాతలు.

రెండు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని కుటుంబాలను కలిసి.. అందులో ఫ్యామిలీ స్టార్స్‌ను సత్కరిస్తామని తెలిపారు దిల్ రాజు, పరశురామ్, విజయ్ దేవరకొండ.