ఫ్యాన్స్  దిల్ ఖుషి చేసిన పుష్పరాజ్.. 

TV9 Telugu

23 May 2024

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న పుష్ప 2పై అంచనాలు ఎలా ఉన్నాయో చెప్పనక్కర్లేదు. 

ఇటీవల విడుదలైన బన్నీ స్పెషల్ గ్లింప్స్ చూస్తే ఈ సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థమవుతుంది. టీజర్ కూడా ఆకట్టుకుంది.

ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ దేశాన్ని ఊపేస్తుంది. తాజాగా రెండో పాటపై క్లారిటీ వచ్చింది.

తాజాగా ఈ రెండో సాంగ్ ప్రోమో విడుదల చేసింది చిత్రయూనిట్. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరలవుతుంది.

పుష్ప 2 నుంచి రెండో పాటను మే 29న 11 గంటల 7 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు మూవీ మేకర్స్.

ఈ సాంగ్ బన్నీ, రష్మిక కపుల్ సాంగ్ క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఇందులో వీరిద్దరూ కలిసి స్టెప్పులు వేయనున్నారు.

ఇదిలా ఉంటే స్వతంత్ర దినోత్సవం కానుకగా ఈ సినిమా ఆగస్ట్ 15న గ్రాండ్ గా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నారు.

ఈ సినిమాలో మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్, సునీల్, అనుసూయ, జగదీష్ కీలకపాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే.