విడుదలకి ముందే పుష్పగాడి రూల్ మొదలు..
TV9 Telugu
20 April 2024
అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా సుకుమార్ తెరకెక్కితున్న చిత్రం మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం పుష్ప 2.
ఇందులో సునీల్, అనసూయ, ఫాహద్ ఫాజిల్ డాలీ ధనంజయ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.
బన్నీ ఫ్యాన్స్, సినీ ప్రేముకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
అత్యంత గ్రాండ్ గా రూపొందుతున్న పుష్ప 2 సినిమాపై సోషల్ మీడియా వేదికగా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.
‘పుష్ప 2’ సినిమా హిందీ వెర్షన్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఏకంగా 200 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్లు సమాచారం.
రిలీజ్ కుముందే అన్ని రకాల రైట్స్ కలిపి పుష్ప 2 సినిమాకు ఏకంగా రూ. 1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం.
ఈ వార్త విన్న అల్లు అర్జున్ అభిమానులు థ్రిల్ అవుతున్నారు. పాన్ ఇండియాలో రూపొందుతున్న సినిమా ఇది.
ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు కన్నడ, హిందీ, తమిళం, మలయాళం వంటి భాషల్లోకి డబ్ చేసి విడుదల చేయనున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి