6 నిమిషాల సీన్‌ కోసం.. ఏకంగా 60 కోట్ల ఖర్చు

TV9 Telugu

13 April 2024

అల్లు అర్జున్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న పుష్ప 2 టీజర్ ఇటీవల విడుదలైంది. అంచనాలకు తగ్గట్టుగానే ఈ టీజర్ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించింది.

ఒక్క డైలాగ్ లేకపోయినా బన్నీ సినిమా టీజర్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. మిలియన్ల కొద్దీ వ్యూస్ రాబట్టి అన్ని రికార్డులను తిరగరాసేస్తోంది.

దాంతో పాటే టీజర్ లో తిరుపతి గంగమ్మ జాతర సన్నివేశాలు ఓ రేంజ్లో ఉన్నాయనే విషయం కూడా అందరికీ తెలిసిపోయింది.

పుష్ప 2 టీజర్ కోసం నిర్మాతలు భారీ బడ్జెట్‌ను వెచ్చించారని ఫిల్మ్ సర్కిల్ లో ప్రచారం జరుగుతోంది.  ఈ జాతర సన్నివేశాన్ని సుకుమార్ 30 రోజులకు పైగా చిత్రీకరించారట.

ఈ సన్నివేశం షూటింగ్ అల్లు స్టూడియోలో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో జరిగింది. సినిమాలో కీలకమైన సన్నివేశం కాబట్టి వందలాది మంది ఆర్టిస్టులు ఈ చిత్రీకరణలో పాల్గొన్నారు.

ఈ సన్నివేశానికి ప్రత్యేక మెరుగులు దిద్దేందుకు ముంబై నుంచి ఖరీదైన కెమెరాలను తెప్పించారట షూటింగ్ కోసం దాదాపు 30 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసినట్లు సమాచారం.

ఇక స్టార్ నటీనటుల రెమ్యూనరేషన్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు, స్పెషల్ ఎఫెక్ట్స్, సౌండ్ డిజైన్ తదితరాలు అన్నీ కలుపుకుంటే మరో 20 కోట్ల రూపాయలు కావాలి.

ఈ గంగమ్మ జాతర పాట సన్నివేశం సినిమాలో ఆరు నిముషాల పాటు ఉంటుందని ఈ ఒక్క ఆరు నిమిషాల సన్నివేశానికి సుమారు 60 కోట్లు వరకు ఖర్చు అయిందని పరిశ్రమలో ఒక టాక్ నడుస్తోంది.