భారీ ధరకు పుష్ప థియేట్రికల్  రైట్స్

TV9 Telugu

21 April 2024

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి ఇప్పుడు పాన్-ఇండియా స్థాయిలో క్రేజ్ఉంది. ముఖ్యంగా పుష్ప సినిమా తర్వాత ఆయనకు దేశవ్యాప్తంగా అభిమానులున్నారు.

ఇప్పుడు అందరి దృష్టి అల్లు అర్జున్ నటిస్తోన్న 'పుష్ప 2' సినిమాపైనే ఉంది. ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప 2’ సినిమా రాబోతోంది. అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్నారన్న విషయం తెలిసిందే.

పాన్ ఇండియాలో రూపొందుతున్న సినిమా ఇది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు కన్నడ, హిందీ, తమిళం, మలయాళం వంటి భాషల్లోకి డబ్ చేసి విడుదల చేయనున్నారు.

అత్యంత గ్రాండ్ గా రూపొందుతున్న అల్లు అర్జున్ పాన్ ఇండియా 'పుష్ప 2' సినిమాపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.

ఉత్తర భారతదేశంలో హిందీ ప్రేక్షకులు ఎక్కువ. దక్షిణాది నుండి హిందీలోకి డబ్ చేయబడిన సినిమాలకు ఉత్తర భారతదేశం అతిపెద్ద మార్కెట్.

'పుష్ప 2' సినిమా హిందీ వెర్షన్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఏకంగా 200 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్లు సమాచారం . ఈ వార్త విన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ థ్రిల్ అవుతున్నారు.