తేజతో పూరీ సినిమా..!

TV9 Telugu

19 May 2024

తొలి టాలీవుడ్ సూపర్ హీరో హనుమాన్ సినిమాతో సంచలన విజయం సాధించి.. పాన్ ఇండియన్ స్టార్ అయిపోయారు తేజా సజ్జా.

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రూపొందించిన మూవీతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించుకున్నాడు ఈ టాలీవుడ్ యంగ్ హీరో.

దీని తర్వాత వరుస సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నారు ఈ హీరో.  ఈయన చాలా జాగ్రత్తగా సినిమాలు సైన్ చేస్తున్నారిప్పుడు.

ఇప్పుడు ఓ టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నట్టు సమాచారం. ఆయన ఎవరో డైనమిక్ దర్శకుడు పూరీ జగన్నాథ్‌.

స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌, తేజ సజ్జ కాంబినేషన్ లో త్వరలోనే ఓ సినిమా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్‌తో బిజీగా ఉన్నారు పూరీ జగన్నాథ్.  దీని తర్వాత ఈ మూవీ మొదలుకానున్నటు తెలుస్తోంది.

ప్రస్తుతం హనుమాన్ మూవీ సీక్వెల్ కోసం వెయిట్ చేస్తున్నాడు. జై హనుమాన్ టైటిల్‏తో రాబోతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుంది.

ఈ క్రమంలోనే ఇటీవల తేజ తన కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. ఈసారి మరో హిస్టారికల్ మూవీ మిరాయ్‌తో మన ముందుకు వస్తున్నాడు.