అందనికి ప్రాణం పోసి, జీవం ఇస్తే ఈమెలానే ఉంటుందేమో..

08 December 2023

05 అక్టోబర్ 1989న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో ఓ హిందూ కుటుంబంలో జన్మించింది అందాల తార పూజిత పొన్నాడ.

తమిళనాడులోని SRM ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి B.Tech సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పట్టా పొందింది.

అమితాబ్ బచ్చన్, చిరంజీవి, అమీర్ ఖాన్, అనిల్ కపూర్, రణవీర్ కపూర్ ఈ వయ్యారికి ఇష్టమైన హీరోలని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

మెరిల్ స్ట్రీప్, సమంత అక్కినేని, శ్రీదేవి ఈ ముద్దుగుమ్మ అభిమాన హీరోయిన్లు అంటూ ఓ పాత ఇంటర్వ్యూలో తెలిపింది.

లతా మంగేష్కర్, ఏఆర్ రెహమాన్, శంకర్ మహదేవన్ ఫేవరేట్ గాయకులు. వీరి పాటలు అంటే ఈ అందాల భామకి చాల ఇష్టం.

షార్ట్ ఫిల్మ్‌లతో తన యాక్టింగ్ కెరీర్ ప్రారంభించే ముందు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసింది.

నాగార్జున, కార్తీ, తమ్మన్న భాటియా ప్రధాన పాత్రల్లో వచ్చిన ఊపిరి సినిమాలో ఓ చిన్న పాత్రతో సినీ అరంగేట్రం చేసింది.

ఇటీవల రవితేజ రావణాసురలో కనిపించింది. ప్రస్తుతం హరి హర వీరమల్లు చిత్రంలో ఓ పాత్రలో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ.