TV9 Telugu

ప్రభాస్ ఫ్యాన్స్ కు సలార్ పై ప్రొడ్యూసర్స్ స్పెషల్ రిక్వెస్ట్.!

23 December 2023

బాహుబాలి తర్వాత సలార్ సినిమాతో ఆ రేంజ్ హిట్ అందుకున్నాడు ప్రభాస్. 

డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చింది. 

ఇందులో ప్రభాస్ ఊరమాస్ లుక్‏లో కనిపిస్తున్నారు. ఇప్పటికే థియేటర్లలో రచ్చ చేస్తున్నారు ఫ్యాన్స్.

ప్రభాస్ భారీ కటౌట్స్ ఏర్పాటు చేసి సంబరాలు జరుపుకుంటున్నారు.

అయితే ఈసినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుండడంతో పైరసీ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు మేకర్స్. దీంతో ప్రభాస్ అభిమానులకు స్పెషల్ రిక్వెస్ట్ చేశారు.

సలార్ సినిమాకు సంబంధించిన పైరసీ ఎక్కడైనా కనిపిస్తే తమ యాంటీ పైరసీ టీంకు తెలియజేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు.

ట్విట్టర్ లో ఈ సినిమాకు సంబంధించిన ముఖ్యమైన సీన్లను ఎవరైనా పోస్ట్ చేసినా తమకు తెలియజేయాలని కోరారు.

ట్విట్టర్ లో మీరు పైరసీ కంటెంట్ చూస్తే X@BLOCKXTECHS అంటూ రీ ట్వీట్ చేయాలని అన్నారు.

అలాగే ఏదైనా పైరసీ సైట్స్ లో సలార్ మూవీ లేదా సినిమాకు సంబంధించిన ఏ విషయం కనిపించినా REPORT@BLOCKXTECH.COM అనే మెయిల్ కు మెసేజ్ చేయాలని కోరారు నిర్మాతలు.