నెటిజన్ కి నిర్మాత ఎస్కేఎన్ కౌంటర్..
TV9 Telugu
01 August 2024
రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వం రాజాసాబ్ తెరకెక్కుతున్న సంగతి తెలిసింది. ఇది హారర్ రొమాంటిక్ గా వస్తుంది.
ఈ ఏడాది సంక్రాంతికి ఈ సినిమాని అధికారకంగా ప్రకటించారు మేకర్స్. ఆ సమయాలు విడుదల పోస్టర్ కూడా ఆకట్టుకుంది.
అయితే తాజగా ఈ మూవీ గ్లింప్స్ ను విడుదల చేసారు మేకర్స్. ఫ్యాన్ ఇండియా గ్లింప్స్ పేరుతో ఇది విడుదలైంది.
ఈ గ్లింప్స్ చూసిన సినీ ప్రేమికులు, రెబెల్ స్టార్ ఫ్యాన్స్ వింటేజ్ డార్లింగ్ ఐస్ బ్యాక్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
ఇందులోనే ఈ సినిమా వచ్చే ఏడాది వేసవికి అంటే ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు మేకర్స్.
ఇదిలా ఉంటె ఈ గ్లింప్స్ అనౌన్స్మెంట్ పోస్టర్ విడుదల చేసినప్పుడు ఓ నెటిజన్ రాధేశ్యామ్ 2 లోడింగ్ అంటూ ట్వీట్ చేసాడు.
ఈ ట్వీట్ చుసిన ఈ చిత్ర నిర్మాతల్లో ఒక్కరైన ఎస్కేఎన్ దీనికి కౌంటర్ గా రిప్లైగా ఓ ట్వీట్ చేసారు. ఇది వైరల్ గా మారింది.
'ఈ ట్వీట్ డిలీట్ చేయకూడదు నువ్వు మరి తర్వాత' అంటూ ఆ నెటిజెన్ల కి కౌంటర్ ట్వీట్ చేసారు నిర్మాత ఎస్కేఎన్.
ఇక్కడ క్లిక్ చెయ్యండి