బన్నీ కోసం వెయిట్ చేస్తున్న టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్‌..

13 September 2023

ఒకప్పుడు బాలీవుడ్ ఎంట్రీ కోసం మన స్టార్స్ వెయిట్ చేసేవారు. కానీ ఇప్పుడు మన హీరోల డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు నార్త్ మేకర్స్‌.

ఈ ట్రెండ్‌ను స్టార్ట్ చేసిన ప్రభాస్‌, ఇప్పటికీ ఆ రేంజ్‌ను అలాగే కంటిన్యూ చేస్తూ బాలీవుడ్ మేకర్స్‌కు మోస్ట్ వాంటెడ్‌గానే ఉన్న మన బాహుబలితో వరుస సినిమాలు చేస్తోంది టీ సిరీస్‌.

రీసెంట్‌గా టీ సిరీస్‌ బ్యానర్‌లో రూపొందిన ఆదిపురుష్ సినిమాతో ఆడియన్స్‌ ముందుకు వచ్చారు ప్రభాస్‌. ఈ చిత్రం ఆకట్టుకోలేకపోయింది.

ఇది నిరాశపరిచినా డార్లింగ్‌తో చేయబోయే నెక్ట్స్ ప్రాజెక్ట్ మీద ఫుల్‌ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు టీ సిరీస్‌ అధినేత భూషణ్ కుమార్‌. స్పిరిట్‌ సినిమా డార్లింగ్ ఫ్యాన్స్‌కు ఫుల్‌ కిక్‌ ఇస్తుందంటున్నారు.

ప్రజెంట్ టాలీవుడ్ ఫిల్మ్ మేకర్‌ సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో యానిమల్ సినిమాను నిర్మిస్తున్నారు భూషణ్ కుమార్.

ఈ సినిమా పూర్తయిన వెంటనే సందీప్ డైరెక్షన్‌లోనే ప్రభాస్ స్పిరిట్ వర్క్‌ స్టార్ట్ అవుతుందని క్లారిటీ ఇచ్చారు.

ప్రభాస్‌తో బ్యాక్‌ టు బ్యాక్ రెండు సినిమాలు చేస్తున్న భూషణ్ కుమార్‌, ఆ తరువాత ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్‌తోనూ ఓ సినిమా చేసేందుకు ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం పుష్ప 2 వర్క్‌లో బిజీగా ఉన్న బన్నీ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నారు నిర్మాత భూషణ్ కుమార్.

బన్నీ ఓకే అంటే వెంటనే ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు రెడీ అన్నారు టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్‌.