"హరిహర వీరమల్లు" అప్డేట్. నిర్మాత రత్నం ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
Anil Kumar
14 June 2024
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తెలుగు పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ సినిమా 'హరిహర వీరమల్లు'.
ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు నిర్మాతగా ఎ.ఎం.రత్నం వ్యవహరిస్తున్నారు.
పవన్ సరసన నిధి అగర్వాల్ ఈ సినిమాలో కథానాయకిగా నటిస్తుంది. ఎం. ఎం. కీరవాణి దీని సంగీతం అందిస్తున్నారు.
ఇప్పటికి ఈ సినిమా షూటింగ్ కి చాలసార్లు బ్రేక్ పడిన ఈ సినిమా పక్క రిలీజ్ అవుతుంది అని మాత్రం తెలిపారు నిర్మాత.
మరోసారి ఈ సినిమా అప్డేట్ గురించి మాట్లాడిన ప్రొడ్యూసర్ ఎ.ఎం.రత్నం మరిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
తన కుమారుడు ఎ.ఎం.జ్యోతికృష్ణకు ఈ ప్రాజెక్టు గురించి అంతా తెలుసని.. గతంలో కొన్ని సినిమాలకు డైరక్ట్ చేశారని అన్నారు.
ఒక ప్రాజెక్టుకు పలువురు దర్శకులు పనిచేయడం కొత్త ఏమి కాదని.. హాలీవుడ్‌లో ఈ కల్చర్ ఎప్పటినుండో ఉందని అన్నారు.
ముందెప్పుడు చూడని విధంగా పవన్ కనిపిస్తారని.. హరిహర వీరమల్లు భారీ బ్లాక్ బస్టర్ అవుతుందని అన్నారు ఎ.ఎం.రత్నం.
ఇక్కడ క్లిక్ చెయ్యండి