మరోసారి ఆ క్రేజీ హీరోతో జతకట్టనున్న ప్రియాంక మోహన్..

23 October 2023

నాని హీరోగా వచ్చిన గ్యాంగ్ లీడర్ చిత్రంలో కథానాయకిగా తెలుగు తెరకు పరిచయం అయింది వయ్యారి భామ ప్రియాంక మోహన్.

గ్యాంగ్ లీడర్ చిత్రంలో హీరోయిన్ గా తన అందం, అభినయంతో తెలుగు కుర్రాళ్ల మనసు దోచేసింది ఈ ముద్దుగుమ్మ.

తర్వాత శర్వానంద్ కి జోడిగా శ్రీకారం అనే చిత్రంతో మరోసారి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది ఈ అందాల తార.

వీటి తరవాత డాక్టర్, ఈతర్క్కుమ్ తునింధవన్ (తెలుగులో ఈటీ), డాన్ వంటి తమిళ బ్లాక్ బస్టర్ చిత్రాల్లో హీరోయిన్ గా ఆకట్టుకుంది.

ప్రస్తుతం తమిళంలో కెప్టెన్ మిల్లర్, తెలుగులో ఓజి చిత్రాల్లో కథానాయకిగా నటిస్తుంది అందాల భామ ప్రియాంక.

ఇదిలా ఉంటె మరో తెలుగు సినిమాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ బ్యూటీ. దీని చిత్రీకరణ త్వరలో ప్రారంభం కానుంది.

నాని హీరోగా రెండో సారి వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని31 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న చిత్రంలో కథానాయకిగా కనిపించనుంది ఈ బ్యూటీ.

గ్యాంగ్ లీడర్ తర్వాత ఈ మూవీలో నానితో మరోసారి జతకట్టనుంది ఈ వయ్యారి. అక్టోబర్ 24న ఈ చిత్రం పూజ కార్యక్రమం జరగనుంది.