అందం ధర్నా చేస్తుందేమో తన సంపద ఈమె దోచుకోందని..

06 December 2023

20 నవంబర్ 1994న తమిళనాడు రాజధాని చెన్నైలో జన్మించింది అందాల తార ప్రియాంక అరుల్ మోహన్. ఈమె తండ్రి తమిళ. తల్లి కన్నడ.

తెలుగు, తమిళ చిత్రాల్లో ఎక్కువగా నటించింది. తెలుగు అమ్మాయి కాకపోయినా తెలుగులో సునాయాసంగా మాట్లాడగలదు ఈ వయ్యారి.

2019లో గిరీష్ జి దర్శకత్వం వహించిన ఓంధ్ కథే హెల్లా అనే కన్నడ చిత్రంలో ప్రియాంక అరంగేట్రం చేసింది ఈ బ్యూటీ.

అదే ఏడాది తెలుగులో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నానికి జోడిగా గ్యాంగ్ లీడర్ చిత్రంలో కథానాయకిగా టాలీవుడ్ లో పరిచయం అయింది.

2021లో శర్వానంద్ సరసన శ్రీకారం అనే తెలుగు డ్రామా చిత్రంలో హీరోయిన్ గా తన అందంతో ఆకట్టుకుంది ఈ వయ్యారి భామ.

అదే ఏడాది యంగ్ హీరో శివ కార్తికేయన్ సరసన కథానాయకిగా డాక్టర్ అనే ఓ తమిళ చిత్రంతో కోలీవుడ్ ప్రేకాకులకు పరిచయం అయింది.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సరసన ఓజి, నానికి జోడిగా సరిపోదా శనివారం అనే రెండు తెలుగు చిత్రాల్లో హీరోయిన్ గా చేస్తుంది.

తమిళంలో కూడా ధనుష్ కెప్టెన్ మిల్లర్, జయం రవి బ్రదర్ అనే రెండు చిత్రాల్లో కథయకిగా నటిస్తుంది ఈ అందాల భామ.