ఈమె అందానికి వజ్రం కూడా  సరితూగదేమో..

28 October 2023

20 నవంబర్ 1994న తమిళనాడు రాజధాని చెన్నైలోని ఓ తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది అందాల తార ప్రియాంక అరుల్ మోహన్.

2019లో గిరీష్ జి దర్శకత్వం వహించిన ఓంధ్ కథే హెల్లా అనే కన్నడ చిత్రంతో సినీ అరంగేట్రం చేసింది ఈ ముద్దుగుమ్మ.

విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన నాని గ్యాంగ్ లీడర్ చిత్రంలో కథానాయకిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.

తర్వాత శర్వానంద్ సరసన హీరోయిన్ గా శ్రీకారం చిత్రంతో తెలుగు కుర్రాళ్ల మనసు దోచేసింది వయ్యారి భామ ప్రియాంక.

తర్వాత శివ కార్తికేయన్ హీరోగా వచ్చిన డాక్టర్ చిత్రంలో హీరోయిన్ గా తమిళంలో పరిచయం అయింది ఈ సొగసరి భామ.

2022లో సూర్య ఈతర్క్కుమ్ తునింధవన్ (తెలుగులో ఈటీ), రెండోసారి డాన్ చిత్రంలో శివ కార్తికేయన్ తో జతకట్టింది ఈ బ్యూటీ.

ప్రస్తుతం తమిళంలో ధనుష్ కి జోడి యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ కెప్టెన్ మిల్లర్ అనే సినిమాలో నటిస్తుంది ఈ భామ.

తెలుగులో పవన్ కళ్యాణ్ ఓజితో పాటు నానికి జోడిగా రెండోసారి సరిపోదా శనివారం అనే చిత్రంలో కథానాయకిగా కనిపించనుంది.